సభకు రావాలని ప్రధానికి ఆదేశాలివ్వలేను.. రాజ్యసభ ఛైర్మన్

-

మణిపుర్ అల్లర్లు పార్లమెంటును కుదిపేస్తున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాలు మణిపుర్ వ్యవహారంపై చర్చకు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా.. మ‌ణిపుర్ అంశంపై ఇవాళ కూడా పార్ల‌మెంట్​లో ర‌గ‌డ కొనసాగింది. రాజ్య‌స‌భ‌లో ఇవాళ ఆ అంశంపై చ‌ర్చించాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేశాయి. మ‌ణిపుర్ వ్యవహారంపై చ‌ర్చించాల‌ని సుమారు 60 మంది స‌భ్యులు రాజ్యసభ ఛైర్మన్​కు నోటీసులు ఇచ్చారు. రూల్ 267 కింద చ‌ర్చించాల‌ని డిమాండ్ చేశారు. కానీ ఆ నోటీసుల‌ను ఛైర్మన్ జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్‌ తిర‌స్క‌రించారు. ప్ర‌శ్నోత్త‌రాలు నిర్వ‌హించేందుకు మొగ్గుచూపారు.

అయితే రాజ్య‌స‌భ విప‌క్ష నేత మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే మాట్లాడుతూ స‌భ‌కు ప్ర‌ధాని వ‌చ్చేలా ఆదేశాలు ఇవ్వాల‌ని ఛైర్మన్‌ను కోరారు. ప్రధానికి అలాంటి ఆదేశాలను తాను ఇవ్వలేనని రాజ్యసభ ఛైర్మన్ స్పష్టం చేశారు. అయితే నోటీసుల్ని తిర‌స్క‌రించ‌డంతో.. విప‌క్ష ఎంపీలు స‌భ నుంచి వాకౌట్ చేశారు. మరోవైపు లోక్​సభ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రధాని మణిపుర్ అంశంపై ప్రకటన చేయాలంటూ విపక్షాలు గందరగోళం సృష్టించాయి. ఈ నేపథ్యంలో లోక్​సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version