చాలా మంది ప్రయాణాలు చేయడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రయాణం పడదు. ఆరోగ్యం పాడవుతుంది. వికారంగా అనిపించడం వాంతులు అయిపోవడం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. జర్నీ చేస్తున్నప్పుడు ఎదురయ్యే వాసన, గాలి వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు దాని వలన తల తిరగడం, వాంతులు, మోషన్స్ సిక్ నెస్ ఇలాంటి పరిస్థితులు కలుగుతాయి అటువంటప్పుడు ఈ చిట్కాలు ని పాటిస్తే ఈ సమస్య నుండి సులభంగా బయటపడొచ్చు.
ప్రయాణ సమయంలో అవసరమైన మందుల్ని దగ్గర పెట్టుకోవాలి. గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలు ఉంటే ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోండి. టీ, కాఫీలకి దూరంగా ఉండండి. జీర్ణక్రియ ప్రక్రియను పాడుచేసి.. కడుపు లో గ్యాస్ ని టీ కాఫీలు ఉత్పత్తి చేస్తాయి. సో వాటికి దూరంగా ఉండడం మంచిది. ఖాళీ కడుపుతో కూడా ఉండకండి. సులభంగా జీర్ణమయ్యే కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది ఇటువంటి సమస్యలు ఏమి రావు.
కడుపునొప్పి కూడా ఉండదు. ప్రయాణంలో తరచు వాంతులు చేసుకుంటున్నట్లయితే నోటిలో యాలకులను పెట్టుకోండి. వికారం సమస్య తగ్గుతుంది. అర టీ స్పూన్ నల్ల ఉప్పు, నిమ్మకాయ రసం, తేనె కలిపి తీసుకుంటే గ్యాస్ సమస్య ఉండదు. ఖాళీ కడుపుతో గోరువెచ్చని పాలు అస్సలు తాగకండి, పండ్ల రసాలు తాగుతూ ఉండండి. సిట్రస్ ఫ్రూట్స్ ని తింటూ ఉండండి ఇలా ప్రయాణం సమయంలో వీటిని కనుక మీరు పాటించారంటే ఏ బాధ ఉండదు. హాయిగా ప్రయాణం చేసి వచ్చేయొచ్చు.