తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగులు గరం అవుతున్నారు. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టడాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
రేవంత్ ప్రభుత్వంపై నిరసన తెలుపడంతో పాటే ‘ఖబర్ధార్ సీఎం రేవంత్ రెడ్డి’..ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు. పథకాల అమలు కోసం హెచ్‌సీయూ భూములు అమ్మకానికి పెట్టడం ఏమిటని విద్యార్థులు క్యాంపస్ ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని ఆందోళనకు దిగారు.
ఖబర్ధార్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
హెచ్‌సీయూ క్యాంపస్ పరిధిలోని 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ.. రేవంత్ ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ, ఖబర్ధార్ సీఎం రేవంత్ రెడ్డి, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేసిన విద్యార్థులు https://t.co/QH2SGLFEVN pic.twitter.com/5pzxT5uKzV
— Telugu Scribe (@TeluguScribe) March 13, 2025