బ్యాంక్ అకౌంట్లో కనీస బ్యాలెన్స్ పరిమితిని రూ. 50,000 కి పెంచుతూ ఐసిఐసిఐ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తున్న సమయంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రియాక్ట్ అయ్యారు. బ్యాంకు అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ ఎంత ఉండాలి అనేది బ్యాంకుల ఇష్టం అని చెప్పారు. కొన్ని బ్యాంకులు రూ. 10,000 ఫిక్స్ చేస్తాయి. మరికొన్ని బ్యాంకులు రూ. 2,000 ఉంచుతాయి.

మరికొన్ని కనీస బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేసాయి. ఇది ఆర్బిఐ నియంత్రణ పరిధిలోకి రాదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా…. ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో కనీస బ్యాలెన్స్ రూ. 50,000 ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఇలాంటి నేపథ్యంలోనే ఆర్బిఐ ఈ విషయం పైన స్పందించి కనీస బ్యాలెన్స్ ఎంత ఉండాలి అనేది బ్యాంకుల ఇష్టం అని ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఐసిఐసిఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బ్యాంకు ఖాతాదారులకు నష్టం ఏర్పడుతుంది. బ్యాంకుదారులకు లాభాలు ఏర్పడతాయి.