పేదలకు కేంద్రం శుభవార్త. కొత్త ఏడాదిలో పేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. 2025లో పేదలకు 2 కోట్ల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
2025 మార్చి 31లోగా అర్హుల ఎంపిక పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధి ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్రం సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్రం మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన చేయనుందట.
2025లో పేదలకు 2 కోట్ల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్త లో ఎంత మేరకు నిజం ఉందో తెలియదు కానీ.. బీజేపీ సోషల్ మీడియాలో ఈ వార్తల వైరల్ గా మారింది. దీనిపై కేంద్ర సర్కార్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ కొనసాగుతోంది.