మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది..ఏకంగా అడవి పందులను!

-

మంచు విష్ణు సిబ్బంది…మరో వివాదంలో చిక్కుకుంది. జల్ పల్లి లోని అడవిలో వేట కొనసాగించింది మంచు విష్ణు సిబ్బంది. అడవి పందులను వేటాడిన విష్ణు సిబ్బంది.. వివాదంలోకి చిక్కుకుంది. చిట్ట అడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడి తీసుకువెళ్లారు మంచు విష్ణు దగ్గర పని చేసే మేనేజర్ కిరణ్.

The staff of Manchu Vishnu who hunted wild boars in the forest of Jalpally

వేటాడిన అడవి పందిని బంధించి తీసుకువెళ్లారు ఎలక్ట్రిషన్ దేవేంద్ర ప్రసాద్. ఇద్దరి చర్యలను తప్పుపడుతూ ఇప్పటికే పలుమార్లు అభ్యంతరం చెప్పారు మంచు మనోజ్. అడవిలోకి వెళ్లి పందులను వేటాడొద్దని హెచ్చరించిన పట్టించుకోని మేనేజర్, ఎలక్ట్రిషన్.. తాజాగా అడవి పందులను వేటాడి తీసుకొచ్చారు. అయితే… అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అదవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నెట్టిజనులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version