BREAKING: శ్రీలంక అధ్యక్ష ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయింది. శ్రీలంక 10వ అధ్యక్షుడు ఎన్నికకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయింది. సెప్టెంబరు 21 వ తేదిన లంకా అధ్యక్షుడు ఎన్నికలు జరుగనున్నాయి. ఆగస్టు 15 తేదిన నామినేషన్ కు చివరి తేది కానుంది. ప్రస్తుత అధ్యక్షుడుగా కొనసాగుతున్న యునైటెడ్ నేషనల్ పార్టీ నేత రణిల్ విక్రమసింఘే మళ్లీ ఎన్నికల్లో పోటీ సైకి సిద్ధంగా ఉన్నారు. అటు అధ్యక్షుడగా మళ్ళీ పోటీ చేస్తానంటూ రాజపక్షే ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది.
దీంతో లంకా ఎన్నికల వైపు చూస్తున్నాయి ప్రపంచం దేశాలు. రణిల్ దేశాన్ని నడపడం విఫలం అయ్యాడని విమర్శలు చేశారు రాజపక్షే. 2019 లో ఎన్నికలలో సజిత్ ప్రేమదాసను ఓడించి భారీ మెజారిటీతో గెలుపొందారు SLPP అభ్యర్థి గోటబయ రాజపక్సే. 2022లో అర్ధికమాద్యం, శ్రీలంక అల్లర్లు, ఎమర్జెన్సీ విధించడంతో రాజపక్సే రాజీనామా చేశారు. దేశ ప్రజలు డిమాండ్ చేయడంతొ 14 జూలై 2022న రాజీనామా చేశారు రాజపక్సే. ఇక అప్పుడే 21 జూలై 2022న శ్రీలంక 9వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రస్తుత ప్రధానమంత్రి రాణిల్ విక్రమసింఘే. ఇక ఇప్పుడు వారిద్దరే బరిలో ఉన్నారు.