అంబానీలా మజాకా.. 600 ఎకరాల్లో ‘వంతారా’ అడవి నిర్మించిన రిలయన్స్ ఫౌండేషన్

-

భారత్‌లోని ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిలయన్స్ ఫౌండేషన్ మరోసారి తన ఉదారతను చాటుకుంది. ఈ ఫౌండేషన్ యజమానులైన అంబానీ కుటుంబం జంతువులపై తమ ప్రేమను చాటుకుంది. ఈ క్రమంలోనే సమగ్ర జంతు సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రానికి ‘వంతారా’ అని నామకరణం చేసినట్లు తెలిపింది. వంతారాను గాయపడ్డ జంతువులను రక్షించడం, చికిత్స చేయడం, సంరక్షణ, పునరావాసం కోసం ఏర్పాటు చేస్తున్నట్లు ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వెల్లడించారు.

కొవిడ్ మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు ఈ జంతు సంరక్షణ కేంద్రం నిర్మించడం ప్రారంభించామని అనంత్ అంబానీ తెలిపారు. ప్రపంచం కరోనాతో బాధపడుతున్నప్పుడు, దీని గురించి ఆలోచించే సమయం దొరికిందని చెప్పారు. మొత్తం 600 ఎకరాల్లో వంతారా అడవిని సృష్టించామని వివరించారు. చిన్నవయసు నుంచే జంతువులను కాపాడాలన్న తన ఆసక్తి ఇప్పుడు వంతారా, నిబద్ధత కలిగిన తమ బృందంతో ఒక మిషన్‌గా మారిందని చెప్పుకొచ్చారు. భారతదేశంలో అంతరించిపోతున్న జంతు జాతులను రక్షించడంపై తాము దృష్టి సారించినట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news