హార్దిక్ పాండ్యా గాయం పై గుడ్ న్యూస్ చెప్పిన రోహిత్ శర్మ

-

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో భాగంగా నిన్న బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఏకంగా 7 వికెట్ల తేడాతో మన భారత జట్టు విజయం సాధించింది. ఇందులో బంగ్లాదేశ్ 256 పరుగులు చేయగా… ఆ లక్ష్యాన్ని 41 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది టీమిండియా. ఇక ఇందులో విరాట్ కోహ్లీ సెంచరీ చేయగా… రోహిత్ శర్మ మరియు గిల్ బాగా రాణించారు.

Rohit Sharma gave good news on Hardik Pandya’s injury

అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడిన సంగతి తెలిసిందే. అయితే హార్దిక్ పాండ్యా గాయం పై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. హార్దిక్ పాండ్యా కు కొంచెం నొప్పి ఉంది… కానీ గాయం పెద్దది కాదు… రేపు ఉదయం అతని పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి… ఆ తర్వాత ముందుకు వెళ్లడం పై ఆలోచిస్తామని రోహిత్ శర్మ కీలక ప్రకటన చేశారు. నిన్నటి మ్యాచ్లో పాండ్యా గాయపడటంతో… అతని ప్లేస్ లో విరాట్ కోహ్లీ బౌలింగ్ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version