ఉక్రెయిన్, రష్యా వివాదంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ దేశం పై మిలటరీ ఆపరేషన్ ను తాజాగా ప్రకటించింది రష్యా దేశం. డోన్‌బోస్ నుంచి ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని కాసేపటి క్రితమే రష్యా వార్నింగ్ ఇచ్చింది.
ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని పుతిన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన ఉక్రెయిన్ ప్రభుత్వం.. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొవాలో ఆలోచన చేస్తోంది. రష్యా దేశ ప్రకటనతో.. ప్రపంచ దేశాలు షాక్ కు గురయ్యాయి. అటు అమెరికా దేశం కూడా ఉక్రెయిన్ కు మద్దతుగా.. తమ బలగాలను దించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఎలాగైనా.. రష్యా దాడుల నుంచి.. ఉక్రెయిన్ ను కాపాడాలని అమెరికా భావిస్తోంది. అయితే… రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరిగితే.. ప్రపంచ దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లుంతుని విశ్లేషకులు చెబుతున్నారు.
Russia's Putin announces a 'military operation' in Ukraine, calls on Ukraine military to 'lay down its arms': AFP pic.twitter.com/jf9M3FU6ir
— ANI (@ANI) February 24, 2022