రాజస్థాన్‌ కాంగ్రెస్‌కు మరో షాక్.. బీజేపీ ఎంపీల ధర్నాలో సచిన్ పైలట్‌

-

రాజస్థాన్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రిల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తన వైఖరితో పార్టీకి చికాకులు తెచ్చిపెడుతున్నారు. ఆ దిశగా గురువారం రోజున మరో అడుగు ముందుకేశారు. ఏకంగా ఈసారి బీజేపీ ఎంపీల ధర్నాలో పాల్గొన్నారు. ఇంతకీ ఏం జరిగిదంటే..

భూవివాదం కారణంగా ఇటీవల ఆత్మహత్య చేసుకొన్న రాంప్రసాద్‌ మీణా (38) కుటుంబానికి మద్దతుగా బీజేపీఎంపీ కిరోడీలాల్‌ మీణా నిర్వహిస్తున్న ధర్నాలో పైలట్‌ ప్రత్యక్షమయ్యారు. బాధిత కుటుంబానికి సత్వరం పారదర్శక న్యాయం కల్పించాలని డిమాండ్‌ చేశారు. స్థానిక సుభాష్‌ చౌక్‌లో గత మూడు రోజులుగా ఈ ధర్నా కొనసాగుతోంది. ఆత్మహత్య చేసుకునేముందు రాంప్రసాద్‌ రికార్డు చేసిన ఓ వీడియోలో కేబినెట్‌ మంత్రి మహేశ్‌ జోషితోపాటు మరికొందరు తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నట్లు ఆరోపణలు చేశారు.

కాగా, అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో రాంప్రసాద్‌ ఆత్మహత్యపై ‘‘చాలా విచారకరం’’ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ స్పందించారు. పేదలు వేధింపులకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version