వరదల్లో కొట్టుకుపోయి చనిపోయిన వారు స్వర్గానికి వెళ్తారని యూపీకి సంబంధించిన సంజయ్ అనే మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దేహాత్ జిల్లాలో భారీగా వరదలు వచ్చాయి. ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో తాజాగా యూపీ మంత్రి సంజయ్ నిషాద్ పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు.

తమ ప్రాంతమంతా నీట మునిగిందని.. ఇండ్లు మొత్తం మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. కొంతమంది వరదలకు కొట్టుకుపోయి చనిపోయినట్లు కూడా చెప్పారు. అయితే దీనిపై మంత్రి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గంగమ్మ తల్లి తన బిడ్డల పాదాలు కడగడానికి వస్తోంది… ఆ గంగా దర్శనం తర్వాత ఆ బిడ్డలు స్వర్గానికి వెళ్తారని పేర్కొన్నారు. మిమ్మల్ని ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి సంజయ్. దీంతో సంజయ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.