బిగ్ అలర్ట్.. తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ రోజు హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇతర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

అటు హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన అది. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, మదీనాగూడ, చందానగర్, లింగంపల్లి, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. ఇవాళ కూడా హైదరాబాద్‌కు కుండపోత వర్షపాతం నమోదు కానుందట.