బెంగాళ్ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం.. 60 ఏళ్ల ముసలావిడపై టీఎంసీ కార్య‌క‌ర్త‌ల అత్యాచారం..!

-

బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చెలరేగిన హింసలో టీఎంసీ మద్దతుదారులు 60 సంవత్సరాల మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పైగా తన మనువడు చూడగానే తనను రేప్ చేశారని బాధిత మహిళ ఆరోపిస్తోంది. తనపై అత్యాచారం చేసిన వారిలో తమ బంధువులు కూడా ఉన్నారని పేర్కొంటొంది. అంతే కాకుండా ఆమె వారిపై ఫైల్ చేసిన కేసును కూడా ఉపసంహరించుకోమని ఒత్తిడి తెస్తున్నారట.

అత్యాచారం

తమకున్న భూమిని సాగు చేసేందుకు బయటకు వెళ్దామంటే బయమేస్తుందని ఆమెకు మీడియాకు చెప్పారు. తనను అత్యాచారం చేసిన బంధువులతో తమకు భూ వివాదం ఉందని ఆమె పేర్కొంటుంది. పైగా అత్యాచారం చేసిన వారు టీఎంసీ మద్దతుదారులని ఆరోపిస్తోంది.

అసెంబ్లీ ఫలితాల తరువాత రాష్ట్రంలో హింస జరిగిందని ఆరోపిస్తూ… బీజేపీ లేవనెత్తిన కేసుల్లో ఇదీ ఒకటి. కలకత్తా హైకోర్టు ఆదేశాల ప్రకారం మానవ హక్కుల సంఘం దీని గురించి దర్యాప్తు ప్రారంభించింది. మమతా బెనర్జీ ప్రభుత్వం హింసను నిరోధించకుండా కొనసాగిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఇలా ఆరోపణలు చేసిన మహిళను మానవ హక్కుల సంఘం సభ్యులు కలిశారు. కానీ ఇవన్నీ పచ్చి అబద్దాలని టీఎంసీ బదులిస్తోంది. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని బీజేపీ పార్టీ కావాలనే మహిళను అడ్డం పెట్టుకుని ఇలా ఆరోపణలు గుప్పిస్తోందని వారు అంటున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిగేలా చూడాలని కోరుతూ ఆమె బీజేపీ పార్టీ నాయకుల సాయంతో జూన్ రెండో వారంలోనే సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version