ఘట్‌కేసర్‌లో దారుణం చోటు చేసుకుంది..ఓ విద్యార్థికి యువతి నగ్న వీడియో కాల్ చేసి.. డబ్బులు వసూలు చేసింది. ఈ సంఘటన పోచారం ఐటీ కారిడార్ లో జరిగింది. ఘట్‌కేసర్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజ్ లో చదువుతున్న విద్యార్థికి… వాట్సాప్‌కు దీక్షికా అగర్వాల్ పేరిట వీడియో కాల్ వచ్చిందని సమాచారం. ఈ సందర్భంగా ఎలా ఉన్నారు..బాగున్నావా..లా చదువుతున్నావు.. పరీక్షలు ఎప్పుడు..అంటూ కాల్ చేశారట.
ఈ తరుణంలోనే… అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తుండగా హఠాత్తుగా నగ్నంగా మారిందట ఆ యువతి. నగ్న వీడియోను రికార్డు చేసి పంపి డబ్బులు డిమాండ్ చేసిందట యువతి. అయితే… డబ్బులు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపిస్తానని బెదిరింపులకు పాల్పడిందట. మూడు విడతలుగా ఆన్‌లైన్‌లో డబ్బులు పంపినా కూడా మరోసారి బెదిరింపులకు పాల్పడ్డారట. బెదిరింపులకు భయపడి పోయి పోలీసులను ఆశ్రయించాడట విద్యార్థి. ఇక దీనిపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.