తెలంగాణ రాష్ట్ర లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సన్న వడ్లకు బోనస్ ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్…. దానికి సంబంధించిన డబ్బులను రైతులకు ఖాతాలలో వేస్తోంది. సన్న వడ్లు మార్కెట్లో ప్రభుత్వానికి విగ్రహించిన తర్వాత రైతుల ఖాతాలలో ఈ బోనస్ డబ్బులు పడుతున్నాయి. రెండు రోజుల నుంచి ఈ డబ్బుల జమ కార్యక్రమం ప్రారంభమైంది.
క్వింటాలుకు 500 రూపాయల చొప్పున రైతుల బ్యాంకు అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం, జగిత్యాల జిల్లాలలో రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డట్టు sms లు కూడా వచ్చాయి. దీంతో రైతులు మెసేజ్లు వచ్చాయని… సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఉత్తంకుమార్ రెడ్డి పేర్లతో డబ్బులు పడ్డట్లు ఎస్ఎంఎస్లు వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. ఇక దళారులకు దాన్యం విక్రయించకుండా.. ప్రభుత్వానికి మాత్రమే విక్రయించాలని అధికారులు చెబుతున్నారు.