రెండ్రోజులుగా వెనకంజలో ఉన్న బుల్స్ ఒక్కసారిగా పరుగును అందుకోవడంతో స్టాక్ మార్కెట్లో మళ్లీ రికార్డుల మోత మోగింది. టీసీఎస్ క్యూ–3 ఫలితాల కన్న ముందు ఐటీ షేర్ల ర్యాలీ, మార్కెట్ల సానుకూల సంకేతాలు, రూపాయి రికవరీలతో సూచీలు ఇంట్రాడే, ముగింపులో çమరో రికార్డును సృష్టించాయి. సెన్సెక్స్ 689 పాయింట్ల లాభంతో 48,782 వద్ద ముగియగా, నిఫ్టీ 210 పాయింట్లు పెరిగి 14,347 వద్ద ఆగింది. లాభాల మార్కెట్‌లలో కూడా ప్రభుత్వ షేర్లు నష్టాలను చవిచూడగా, ఇతర రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు బాగానే లభించింది.
ట్రేడింగ్ ప్రారంభం నుంచి, మంచి కొనుగోళ్లు జరగడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 761 పాయింట్లను ఆర్జించి 48,854 వద్ద, నిఫ్టీ 230 పాయింట్లు పెరిగి 14,367ల గరిష్టాలను నమోదు చేశాయి. అయితే.. డాలర్ మారకంలో రూపాయి విలువ 7 పైసలు బలపడి 73.24 వద్ద స్థిరపడింది. ఈ వారం మొత్తంలో సెన్సెక్స్ 913 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 329 పాయింట్ల పెరిగింది.
ఎలాక్టోరల్ కాలేజీ అధికారులు అమేరికా అధ్యక్షుడిగా జో బెడెన్ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో ఆర్థిక ఉద్దీపన ప్రకటన అంచనాలు భారీగా పెరగడంతో పపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల వైపు మళ్లాయి. కోవిడ్–19 సహాయక చర్యల్లో భాగంగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు సరళతర ద్రవ్య విధానంపై ఆసక్తి చూపుతూ వడ్డీరేట్ల తగ్గింపునకే జై కొడుతున్నాయి. దీని మూలంగా లిక్విడిటీ పెరిగి క్రమక్రమంగా ఈక్విటీ మార్కెట్లోకి అడుగు పెడుతుంది. దీంతో డిసెంబర్ ఆర్థిక గణాంకాలు రికవరీ ప్రతిబింబిస్తున్నాయి.
మార్కెట్ గురించి మరిన్ని వివరాలు..
1.మూడో త్రైమాసిక ఫలితాల నోటిఫికేషన్ ముందు ఐటీ కంపెనీ టీసీఎస్ షేరు 3 శాతం లాభపడి రూ.3,121 వద్ద ముగిసింది.
2. వాహనాలపై పెంచిన ధరలు నుంచి అమల్లోకి రానుండటంతో మహీంద్రా అండ్ మహీంద్రా షేరు 4 శాతం లాభం పొంది ఏడాది గరిష్టాన్ని చేజిక్కుచ్చుకుంది.
3. అబుదాబీకి చెందిన ఏడీక్యూ ఇన్వెస్ట్‌మెంట్ రూ.555 కోట్ల పెట్టుబడులు పెట్టనుండటంతో బయోకాన్ షేరు 2 శాతం లాభపడింది.
4. విప్రో, టెక్ మహీంద్రా, మారుతి సుజుకీ షేర్లు 6 శాతం చొప్పున పెరిగాయి.