భారత ప్రధాని నరేంద్ర మోడీకి తమిళనాడులో షాక్ తగిలిందనే చెప్పాలి. ప్రధానంగా తమిళనాట వివాదంగా మారాయి హిందీ మాసాం వేడుకలు. హిందీ మాసం వేడుకల పై ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసారు సిఎం స్టాలిన్. చెన్నై దూరదర్శన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలతో పాటు హిందీ మాసోత్సవ వేడుకలను జరుపుకోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అని తెలిపారు.
ప్రధానంగా భారత రాజ్యాంగం ఏ భాషకూ జాతీయ భాష హోదా ఇవ్వలేదు. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీ మాసాన్ని జరుపుకోవడం ఎంటి..? అని ప్రశ్నించారు. ఇది ఇతర భాషల పట్ల చిన్న చూపు చూసే ప్రయత్నం లాంటిది అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే ఆయా రాష్ట్రాల స్థానిక భాషా మాస వేడుకలను కూడా జరుపుకోవాలి అని లేఖ లో తెలిపారు సీఎం స్టాలిన్. ప్రస్తుతం స్టాలిన్ లేఖ సంచలనంగా మారింది.