దండకారణ్యంలో వరుస ఎదురు కాల్పుల్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగులుతోంది. తాజాగా ఈ ఉదయం ఛతీస్ గడ్ సుక్మా జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో మృతుల సంఖ్య 17కి పెరిగింది. ఈ కాల్పులలో మావోయిస్టు అగ్రనేత జగదీశ్ మృతి చెందారు. స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్న జగదీశ్ ఇవాళ జరిగిన కాల్పుల్లో మరణించినట్టు ఛతీస్ గడ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ వెల్లడించారు. ఆయన తలపై రూ.25లక్షల రివార్డు ఉందన్నారు.
జగదీశ్ ఛతీస్ గడ్ లోని జీరామ్ లోయలో 2013న 30 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను హత్య చేసి మారణహోమం సృష్టించిన కేసులో 2023లో 10 మంది జవాన్లు, ఓ డ్రైవర్ మృతి చెందిన దంతెవాడ పేలుడులో సూత్రధారిగా ఉన్నారని చెప్పారు. సుక్మాలో ఇవాళ జరిగిన ఆపరేషన్ లో తమ భద్రతా సంస్థలు 17 మంది నక్సలైట్లను మట్టుబెట్టాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.