మావోయిస్టుల అడ్డా సింహ్‌భూమ్‌లో తొలిసారి పోలింగ్‌

-

మావోయిస్టుల కంచుకోటగా పేరున్న ఝార్ఖండ్‌ ‘సింహ్‌భూమ్‌’ పార్లమెంట్‌ నియోజకవర్గంలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లో 118 పోలింగ్‌ బూత్‌లను ఎన్నికల కమిషన్‌ ఏర్పాటు చేస్తోంది. ఇక్కడికి పోలింగ్‌ బృందాలను, సామగ్రిని హెలికాప్టర్లలో తరలించనున్నారు. ఇక్కడ మే13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఆసియాలోని అత్యంత చిక్కటి సాల్‌ అడవి కేంద్రమైన సరండేలో  పోలింగ్‌ నిర్వహించడం ఈసీకి సవాలుగా మారింది.

 

ఒక్క ఓటరు కూడా పోలింగ్‌కు దూరం కాకూడదనే లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని పశ్చిమ సింహ్‌భూమ్‌ జిల్లా కలెక్టర్‌ కుల్దీప్‌ చౌద్రీ అన్నారు. మావోయిస్టు వేర్పాటు వాదం బలపడిన ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల తొలిసారి మరికొన్ని చోట్ల రెండు దశాబ్దాల తర్వాత జరుగుతున్న ఎన్నికలు ఇవి అని తెలిపారు. తాము వెళ్లని ప్రాంతం ఉండదని చెబుతున్నానని చౌద్రీ చెప్పారు. ఇక్కడి నుగ్డి, బొరెరో ప్రాంతాల్లోని ప్రజలు జీవితంలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

పశ్చిమ సింహ్‌భూమ్‌ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. ఇక్కడ గతేడాది మొత్తం 46 తీవ్రవాద ఘటనలు చోటుచేసుకోగా.. 22 మంది మరణించారు. ఈ ప్రాంతంలో ప్రజలకు ఓటు హక్కు కల్పించేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version