IPL 2023 : మళ్లీ గొడవ పడ్డ సిరాజ్‌.. ఇక బుద్ది రాదు

-

నిన్న ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా ఓపెనర్ ఫిల్ సాల్ట్ తో ఆర్సిబి బౌలర్ సిరాజ్ వాగ్వాదానికి దిగాడు. సిరాజ్ వేసిన ఐదో ఓవర్ లో సాల్ట్ వరసగా రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టారు. దీంతో నెక్స్ట్ బంతి షార్ట్ బాల్ వేయగా, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

పెదవులపై వేలు వేసుకొని సైలెంట్ గా ఉండు అంటూ సిరాజ్…. సాల్ట్ ను హెచ్చరించారు. అయితే మ్యాచ్ అనంతరం వీరిద్దరూ హాగ్ చేసుకుని, గొడవకు ఫుల్ స్టాప్ పెట్టారు. కాగా, ఐపీఎల్‌ లో మరో మైలురాయిని అందుకున్న కోహ్లీ. ఆర్సిబి స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఐపిఎల్ లో మరో మైలురాయిని అందుకున్నారు.

శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్లో 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ 7వేల పరుగులు మార్క్ ను చేరుకున్నాడు. ఐపీఎల్ లో ఏడు వేల రన్ సాధించిన తొలి బ్యాటర్ గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. కోహ్లీ 233 మ్యాచుల్లో ఈ ఘనత సాధించాడు. ఇక కింగ్ కోహ్లీ ఖాతాలో ఐదు సెంచరీలు, 49 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ తర్వాతి స్థానంలో శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version