IPL 2023 : చిన్ననాటి కోచ్ కాళ్లు మొక్కిన కోహ్లీ.. వీడియో వైరల్

-

టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ తన చిన్ననాటి కోచ్ ను గౌరవించిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది. ఐపిఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తుండడం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ ఆడేందుకు కోహ్లీ తన సొంత గడ్డ ఢిల్లీ వచ్చాడు.

ఈ సందర్భంగా కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ తన శిష్యుడిని చూసేందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి వచ్చారు. తన క్రికెట్ లో ఓనమాలు నేర్పిన గురువును చూడగానే కోహ్లీ చేస్తున్న ప్రాక్టీస్ ను ఆపేసాడు. నేరుగా రాజ్ కుమార్ శర్మ వద్దకు చేరుకొని వినయంగా పాదాలకు నమస్కరించాడు. కాగా, నిన్న ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా ఓపెనర్ ఫిల్ సాల్ట్ తో ఆర్సిబి బౌలర్ సిరాజ్ వాగ్వాదానికి దిగాడు.

సిరాజ్ వేసిన ఐదో ఓవర్ లో సాల్ట్ వరసగా రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టారు. దీంతో నెక్స్ట్ బంతి షార్ట్ బాల్ వేయగా, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పెదవులపై వేలు వేసుకొని సైలెంట్ గా ఉండు అంటూ సిరాజ్…. సాల్ట్ ను హెచ్చరించారు. అయితే మ్యాచ్ అనంతరం వీరిద్దరూ హాగ్ చేసుకుని, గొడవకు ఫుల్ స్టాప్ పెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version