కాంగ్రెస్ ముఖ్య నేత ప్రియాంక గాంధీ రేపు హైదరాబాద్ కు రానున్నారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగించుకొని సరూర్ నగర్ లో యువ సంఘర్షణ సభకు హాజరు కానున్నారు. ప్రియాంక తొలిసారి తెలంగాణకు వస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రియాంక కేవలం గంటన్నర మాత్రమే పర్యటిస్తారని, సభలో యువ డిక్లరేషన్ ప్రకటిస్తారని నేతలు తెలిపారు.
ఇది ఇలా ఉండగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు పలు జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. నేడు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యపేట, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులంబ గద్వాల జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు రెండు రోజులపాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.