మహారాష్ట్ర రాజకీయాలలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాబాయ్ శరద్ పవార్ పై తిరుగుబాటు చేసిన అజిత్ పవార్.. 30 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి షిండే సర్కార్ కు మద్దతు ప్రకటించారు. రాజ్ భవన్ కి చేరుకున్న అజిత్ పవర్ గవర్నర్ కి మద్దతు లేక ఇచ్చారు. అనంతరం సీఎం ఏక్నాథ్ షిండే సైతం అక్కడికి చేరుకున్నారు.
అనంతరం అజిత్ పవార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఆయనతో గవర్నర్ ప్రమాణం చేయించారు. పార్టీ అధిష్టానం పై తిరుగుబాటు చేసి 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మహారాష్ట్రలోని బిజెపి – షిండే శివసేన వర్గం ప్రభుత్వంతో చేతులు కలిపారు. అయితే అజిత్ పవార్ కి ఉపముఖ్యమంత్రి తో పాటు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం.