చీటింగ్ కేసులో బాలీవుడ్ నటి సన్నీలియోన్, ఆమె భర్త డేనియల్ వెబర్, అలాగే ఆమె సిబ్బందికి కేరళ హైకోర్టులో ఊరట లభించింది. సన్నీ లియోన్, ఆమె భర్త డేనియల్ సహా మరో ఉద్యోగిపై కేరళకు చెందిన ఓ ఈవెంట్ మేనేజర్ కేసు పెట్టారు. భారీ మొత్తంలో నగదు చెల్లించినప్పటికీ సన్నీలియోన్ ఒక ఈవెంట్లో ప్రదర్శన ఇవ్వడానికి రాలేదని ఆయన ఆరోపించారు.
దీంతో సన్నీలియోన్ సహ మరో ఇద్దరిపై సెక్షన్ 406, 420, 34 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సన్నీలియోన్ వాంగ్మూలం తీసుకున్నారు పోలీసులు. అయితే ఈ విషయంలో తన తప్పేమీ లేదని, ఈవెంట్ ఆర్గనైజర్ అబద్ధాలు చెబుతున్నాడని సన్నీలియోన్ తెలిపింది. తనకి రావాల్సిన డబ్బు కూడా వారు సకాలంలో చెల్లించలేదని సన్నీ స్పష్టం చేసింది.
ఈ కేసులో జరుగుతున్న విచారణను నిలిపివేయాలని సన్నిలియోన్ దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయమూర్తి జియాద్ రెహ్మాన్ ఏ ఏ స్వీకరించారు. ఆమె పిటీషన్ ను పరిశీలించిన పిదప ఈ కేసులో క్రిమినల్ విచారణ పై తదుపరి ఆదేశాల వరకు స్టే విధించారు.