భూ కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో దిల్లీ కోర్టు తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో ఆయన సతీమణి రబ్రీదేవి, కుమారుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, కుమార్తె, ఆర్జేడీ ఎంపీ మీసా భారతీలకు కూడా బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కుంభకోణం ఏంటి.. లాలూ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో రైల్వేలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొందరు అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారన్న అభియోగాలతో ఆయనపై గతేడాది మే 18వ తేదీన సీబీఐ కేసు నమోదు చేసింది. లాలూతో పాటు మరో 15 మందిపైనా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.
గతేడాది అక్టోబర్లో ఒకటి.. ఈ ఏడాది జులే 3వ తేదీన మరో ఛార్జిషీట్ దాఖలు చేసి. సెప్టెంబరు 22న ఈ కేసులో విచారణకు హాజరుకావాలని నిందితులకు సమన్లు జారీ చేసింది. నేపథ్యంలో లాలూ ప్రసాద్ దిల్లీలో రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించగా.. ఇవాళ లాలూ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.