అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

-

అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యవహారంలో సిట్‌ దర్యాప్తు అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మొత్తం 24 కేసులకు గాను 22 కేసుల విచారణ పూర్తైందని తెలిపింది. పెండింగ్‌లో ఉన్న మిగితా 2 కేసుల దర్యాప్తు 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.

స్టాక్స్‌ ధరలను అదానీ గ్రూప్‌ తారుమారు చేసిందనే ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించాలని దాఖలైన పలు పిటిషన్లపై ఇవాళ సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశంలో సిట్ దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేస్తూ ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సెబీ దర్యాప్తు అధికారాలను తాము నియంత్రించలేమని తెలిపింది. ఈ కేసులోని వాస్తవాల దృష్ట్యా దర్యాప్తును సెబీ నుంచి మరో సంస్థకు బదిలీ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. సెబీ అధికారాల్లోజోక్యం చేసుకోవటానికి కోర్టు పరిధి పరిమితమని వెల్లడించింది.

మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన గౌతమ్‌ అదానీ సత్యమేవ జయతే అంటూ ట్వీట్‌ చేశారు. ఈ వ్యవహారంలో తమకు మద్దతుగా నిలిచివారికి గౌతమ్‌ అదానీ కృతజ్ఞతలు తెలుపుతూ దేశాభివృద్ధికి తమ వంతు ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version