యూజీసీ – నీట్, 2024 పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తూ పలు హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్ల విచారణలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియను ఆపేది లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు అన్ని పిటీషన్లు సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ గతంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం ఇవాళ విచారించింది.
మరోవైపు దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘నీట్- యూజీ ప్రవేశపరీక్ష 2024లో అక్రమాలు జరిగినట్లు వస్తోన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. బిహార్‌లో ఈ పరీక్ష ప్రశ్నా పత్రం లీకైనట్లు సమాచారం రాగా.. కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీన్ని తోసిపుచ్చింది. అయితే, పేపర్ లీక్ నిజమేనని తాజాగా బయటకు రావడం సంచలనం రేపుతోంది. ముందు రోజు రాత్రే నీట్ ప్రశ్న పత్రం తమకు అందిందని బిహార్‌లో అరెస్టయిన కొందరు విద్యార్థులు పోలీసుల ఎదుట అంగీకరించారు. ఇప్పుడు విద్యార్థుల స్టేట్‌మెంట్ సంచలనం రేపుతోంది.