ఆర్టికల్‌ 370 రద్దు సరైనదే – సుప్రీం కోర్టు

-

ఆర్టికల్‌ 370 రద్దు సరైనదేనని ప్రకటన చేసింది సుప్రీం కోర్టు. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేయడంపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కేంద్ర నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జమ్మూ కాశ్మీర్ కు చెందిన పలు పార్టీలు పిటిషన్లు దాఖలు చేశాయి.

Supreme Court verdict on pleas challenging scrapping of Article 370 today

వీటిపై CJI జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి నెల రోజులపాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది. సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వ్ చేయగా, ఇవాళ వెలువరించింది. ఆర్టికల్‌ 370 రద్దు చేయడానికి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీం కోర్టు.. ఆర్టికల్‌ 370 రద్దుపై పిటిషనర్ల వాదనలను తోసిపుచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి విధాన పరమైన నిర్ణయాన్ని సవాల్ చేయలేమని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news