నిందితుల ఇళ్లను బుల్డోజర్‌తో కూల్చడం తగదు.. ఇది చట్ట విరుద్ధం – సుప్రీం కోర్టు

-

నిందితుల ఇళ్లను బుల్డోజర్‌తో కూల్చడం తగదు.. ఇది చట్ట విరుద్ధం అంటూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. యూపీలో ఇళ్ల కూల్చివేతల పై సుప్రీం కీలక తీర్పు ఇవ్వడం జరిగింది. నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం తగదన్న సుప్రీం..ఈ మేరకు సంచలన తీర్పు ఇచ్చింది. నిష్పాక్షిక విచారణ పూర్తికాకుండానే నిందితుడిని దోషిగా పరిగణించలేమని తెలిపింది సుప్రీం.

Supreme verdict on house demolitions in UP

అలాంటి వ్యక్తుల నివాసాలను కూల్చడం అధికార దుర్వినియోగం, చట్ట విరుద్ధం అని కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీం కోర్టు. ఇళ్లను కూల్చడం నివసించే ప్రాథమిక హక్కును కాలరాయడమే అంటూ ఆగ్రహించింది సుప్రీం. దోషిగా నిర్థారించినా సరే చట్ట ప్రకారం శిక్ష ఉంటుంది తప్ప బుల్‌డోజర్‌తో న్యాయం చేయలేమని తెలిపింది సుప్రీం.

Read more RELATED
Recommended to you

Latest news