స్వాతీ మాలీవాల్ ఘటన.. దాడి జరిగిన రోజు కేజ్రీవాల్ నివాసం నుంచి మరో వీడియో

-

ఆప్‌ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో తనపై దాడి జరిగిందంటూ ఆ పార్టీ ఎంపీ స్వాతీమాలీవాల్ ఆరోపణల నేపథ్యంలో.. మరికొన్ని వీడియోలు వెలుగులోకి వచ్చాయి. సీఎం నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు కనిపిస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. స్వాతి మాలీవాల్ ను బయటకు తీసుకువెళ్తున్న సిబ్బందిని ఆమె వదిలించుకునే ప్రయత్నం చేశారు. నిజాలు వెలుగులోకి వచ్చాయంటూ.. ఘటన రోజు, ఆమె కోర్టు ముందు వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్లిన రోజు దృశ్యాలున్న వీడియోను ఆప్‌ షేర్ చేసింది.

తనపై సీఎం సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారంటూ స్వాతి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయన కూడా మాలీవాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె ఆరోపణలు చేయడం వెనక బీజేపీ కుట్ర ఉందని విమర్శించారు. ఈ వ్యవహారంలో స్వాతి ఓ పావు మాత్రమేనని వ్యాఖ్యానించారు.  అపాయింట్‌మెంట్‌ లేకుండా ముఖ్యమంత్రి ఇంటికి స్వాతి చేరుకున్నారని, కేజ్రీవాల్‌పై ఆరోపణలు చేయడమే ఆమె ఉద్దేశమని ఆప్‌ సీనియర్‌ నేత ఆతిశీ ఆరోపించారు.

https://x.com/AamAadmiParty/status/1791699116097208347?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1791699116097208347%7Ctwgr%5E7d5a3966d2598b01f0afe2ddb6f730304c16d552%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-1991724229174170282.ampproject.net%2F2405022220000%2Fframe.html

Read more RELATED
Recommended to you

Exit mobile version