బీఎస్పీ చీఫ్ హ‌త్య‌.. చెన్నై సీపీని బ‌దిలీ చేసిన త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం

-

త‌మిళ‌నాడు బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ చీఫ్ కే ఆర్మ్‌స్ట్రాంగ్‌(52) మూడు రోజుల క్రితం చెన్నై న‌గ‌రంలో దారుణ హ‌త్య‌కు గురైన సంగ‌తి తెలిసిందే. ఈ హ‌త్య కేసును త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. చెన్నై సీపీ సందీప్ రాయ్ రాథోడ్‌ను బ‌దిలీ చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాథోడ్‌ను పోలీసు ట్రైనింగ్ కాలేజీ డీజీపీగా నియ‌మించారు. అడిషన‌ల్ డీజీపీగా కొన‌సాగుతున్న ఏ అరుణ్‌ను చెన్నై న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్‌గా నియ‌మిస్తూ త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

బీఎస్పీ తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ శుక్రవారం రాత్రి పెరంబూరులోని తన ఇంటికి సమీపంలో హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు బైకులపై వచ్చి ఆయనను హత్య చేశారు. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆర్మ్‌స్ట్రాంగ్ పార్థివ‌దేహానికి నివాళులు అర్పించారు. ఆదివారం ఉదయం బీఎస్పీ జాతీయ సమన్వయకర్త ఆకాశ్‌ ఆనంద్‌తో కలిసి తమిళనాడు రాజధాని చెన్నైకి చేరుకున్న మాయావతి.. అక్కడి నేరుగా ఆర్మ్‌స్ట్రాంగ్‌ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ.. ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసు విచారణను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదన్నారు. అందువల్లే ఇప్పటి వరకూ ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేయలేదని చెప్పారు. బాధితుడికి న్యాయం జరగాలంటే ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని మాయావతి డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version