వైఎస్ అంటేనే సంక్షేమం, అభివృద్ధి: రేవంత్ రెడ్డి

-

రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా 35 మంది నేతలకు కార్పొరేషన్ చైర్మన్ల పదవులు అప్పగించామని సీఎం రేవంత్ రెడ్డి. కష్టపడ్డ ప్రతీ నేత, కార్యకర్తకు పదవులు దక్కాలన్న వైఎస్సార్ స్ఫూర్తితోనే ఈ నియామకాలు చేపట్టామన్నారు. గాంధీ భవన్ లో టీపీసీసీ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ అంటేనే సంక్షేమం, అభివృద్ధి అని కొనియాడారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని వైఎస్సార్ సంకల్పించారని గుర్తు చేశారు.

ఆ స్ఫూర్తితో రాహుల్ ను ప్రధానిని చేయడానికి కాంగ్రెస్‌ శ్రేణులు పని చేయాలని పిలుపునిచ్చారు. మూసీ ప్రక్షాళన చేయాలన్న ఆలోచన సైతం వైఎస్సార్ స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం చేపట్టిందన్నారు. సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం ఇదే రోజున తాను తెలంగాణ పీసీసీగా బాధ్యతలు చేపట్టానని.. ఈ మూడు సంవత్సరాల కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ వారసులు అందరూ కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వనిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version