Tamil Nadu BSP Chief Hacked To Death Near His House In Chennai: చెన్నైలో దారుణం జరిగింది. తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ అధ్యక్షుడు కె ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య చోటు చేసుకుంది.
చెన్నై పెరంబూర్‌లోని సదయప్పన్ స్ట్రీట్‌లోని తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ అధ్యక్షుడు కె ఆర్మ్‌స్ట్రాంగ్ ఇంటి వద్ద ద్విచక్ర వాహనాలపై వచ్చి..ఆ తర్వాత అతన్ని కిరాతకంగా నరికి చంపారు దుండగులు.
తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ అధ్యక్షుడు కె ఆర్మ్‌స్ట్రాంగ్ తో పాటు ఆయన వెంట ఉన్న మరో ఇద్దరిపై కూడా దుండగులు దాడి చేశారు. ఇక ఈ ఘటనపై సెంబియం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక టింలతో గాలిస్తున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.