పాఠ‌శాల‌ల్లో భ‌గ‌వ‌ద్గీత బోధ‌న.. గుజ‌రాత్ బాట‌లో మ‌రో రాష్ట్రం

-

గుజ‌రాత్ రాష్ట్ర ప్ర‌భుత్వం గురువారం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. పాఠ‌శాల‌లో విద్యార్థుల‌కు భ‌గ‌వ‌ద్గీత బోధించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. ఈ విషయాన్ని గుజరాత్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బీసీ న‌గేశ్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. నిపుణుల‌తో చర్చించిన త‌ర్వాతే.. ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఆయన తెలిపారు. కాగ తాజా గా మ‌రో రాష్ట్రం కూడా పాఠ‌శాల‌లో భ‌గ‌వ‌ద్గీత ప్ర‌వేశ పెట్టాల‌ని భావిస్తుంది. క‌ర్ణాట‌క లో ఉన్న బ‌స్వ‌రాజ్ బొమ్మై ప్ర‌భుత్వం పాఠ‌శాల‌లో విద్యార్థుల‌కు భ‌గ‌వ‌ద్గీత బోధించాల‌ని భావిస్తుంది.

ఈ విషయాన్ని ఆ రాష్ట్రానికి చెందిన ఒక మంత్రి ప్ర‌క‌టించారు. అయితే దీనిపై పూర్తిగా చ‌ర్చించ‌లేమ‌ని అన్నారు. దీని గురించి త్వ‌ర‌లోనే త‌మ రాష్ట్ర ముఖ్య‌మంత్రి బ‌స్వ‌రాజ్ బొమ్మైతో చ‌ర్చిస్తామ‌ని తెలిపారు. కాగ నైతిక శాస్త్రం గురించి బోధించే స‌మ‌యంలో భ‌గ‌వ‌ద్గీత ప‌రిచయం చేయాల‌ని ఈ రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు భావిస్తున్నాయి. నైతిక శాస్త్రాన్ని మూడు లేదా నాలుగు ద‌శ‌ల‌లో ప్ర‌వేశ పెట్టాల‌ని భావిస్తున్నారు. అయితే అందులో తొలి ద‌శ‌లోనే విద్యార్థుల‌కు భ‌గ‌వ‌ద్గీతను బోధించాల‌ని గుజ‌రాత్, క‌ర్ణాట‌క ప్ర‌భుత్వాలు ప్ర‌య‌త్నిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version