స్వాతంత్య్ర వేడుకల వేళ 19 చోట్ల బాంబులు.. కానీ ఒక్కటీ పేలలేదు?

-

దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కానీ ఈ వేడుకల వేళ అసోంలో 19 ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు తిరుగుబాటు సంస్థ ఉల్ఫా ఐ ప్రకటించడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. అయితే సాంకేతిక కారణాల వల్ల పేలుళ్లు జరగలేదని పేర్కొంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వ్యతిరేకిస్తూ మయన్మార్‌ కేంద్రంగా పని చేసే ఉల్ఫా ఐ, అసోంలోని పలు ప్రాంతాల్లో బాంబు దాడులకు ప్రయత్నించినట్లు ఉల్ఫా ఐ నేత ఇషాన్ అసోమ్ ప్రకటన విడుదల చేశారు.

19 ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు తెలిపిన ఇషాన్.. బాంబులు అమర్చిన ప్రాంతాల పేర్లను కూడా వెల్లడించారు.  గువాహటిలోనే 8 ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు తెలిపారు.  ముందుగా నిర్ణయించినట్లుగా ఆగస్టు 15వ తేదీన ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు దాడులు జరగాల్సి ఉండగా.. సాంకేతిక లోపం వల్ల బాంబు పేలుళ్లు జరగలేదని ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.  ఉల్ఫా ఐ ప్రకటన నేపథ్యంలో అప్రమత్తమైన అసోం పోలీసులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version