వైద్య రంగంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్.. రూ.5వేల కోట్లతో!

-

తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగంపై ప్రధానంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అందుకోసం కొత్తగా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.ముందుగా వైద్య, ఆరోగ్య విభాగంలో చేపట్టనున్న కార్యక్రమాల కోసం ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.4,944 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిని కేంద్రానికి పంపి నిధుల కోసం వరల్డ్ బ్యాంకు సాయం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ట్రామాకార్, డయాలసిస్, క్యాన్సర్ పరీక్షా కేంద్రాలు, డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ల ఏర్పాటు వంటి అంశాల తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధుల కొరత కారణంగా కేంద్రం సాయం తసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం అనుమతిస్తే ప్రపంచబ్యాంకు నుంచి రుణం తీసుకొచ్చి ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేయనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version