వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కోసం ఇప్పటి నుంచే ప్రయాణికులు అడ్వాన్స్‌గా రైలు టిక్కెట్స్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీ ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ముందస్తుగా టికెట్లు బుకింగ్స్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, వారికి ఇప్పటినుంచే కష్టాలు ఎదురవుతున్నట్లు సమాచారం. నాలుగు నెలల ముందే ట్రైన్ టికెట్స్ మొత్తం బుకింగ్ అయిపోయినట్లు చూపిస్తోంది.
గౌతమి, కోణార్క్, సింహపురి, గరీబ్ రథ్, ఫలక్ నుమా, గోదావరి, శబరి, ఎల్‌టీటీ విశాఖ, ఈస్ట్ కోస్ట్, చార్మినార్, వందేభారత్ రైళ్లలోనూ జనవరి 10, 11, 12 తేదీల్లో వెయిటింట్ లిస్టు వందల్లో ఉన్నట్లు చూపిస్తోంది. ఆ పరిమితి కూడా దాటి రిగ్రెట్ కనిపిస్తోంది. దీంతో ముందుగానే ప్రత్యేక రైళ్ల జాబితా విడుదల చేయాలని ప్రయాణికులు సెంట్రల్ రైల్వేను కోరుతున్నారు.కాగా, ఏటా సంక్రాంతికి కోట్ల సంఖ్యలో జనాలు రైళ్లలో ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే.