జీడీపీ లెక్కల కోసం బిగ్‌బాస్కెట్, బ్లింకిట్ డేటాపై కేంద్రం కన్ను!

-

కేంద్రం జీడీని(స్తూల జాతీయోత్పత్తి)ని లెక్కించేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇప్పటివరకు జీడీపీని లెక్కించేందుకు బేస్ ఇయర్ 2011-12గా నిర్ణయించారు. ప్రస్తుతం దానిని 2023-24కు మార్చాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.అందుకే వినియోగ సరళిలో మార్పులు, ఎకనామిక్ యాక్టివిటీ వేగాన్ని తెలుసుకునేందుకు బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వంటి అప్లికేషన్లలో కొనుగోళ్లను డేటాను పరిశీలించాలని నిర్ణయించినట్లు సమాచారం.

ప్రస్తుతం ఒక కుటుంబానికి అవసరమైన గ్రాసరీస్ (సరుకులు)లో 6 శాతం వీటి ద్వారానే కొంటున్నారని కేంద్రం ఓ అంచనాకు వచ్చింది. అందుకే జీఎస్టీ( గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) డేటాను తీసుకుంటే జీడీపీ గణాంకాలు పక్కాగా ఉంటాయని కేంద్రం భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే జీడీపీ పెరుగుదల తగ్గుదలలో వినియోగదారుల కొనుగోలు శక్తి పెరిగిందా? లేదా తగ్గిందా? అనే అంశాన్ని ప్రమాణికంగా తీసుకుంటారని తెలిసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version