ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతి చెందిన దామోదర్ మృతదేహాన్ని పోలీసులకు దొరకకుండా తీసుకెళ్లింది హిడ్మా దళం. ఛత్తీస్గఢ్ కాంకేర్ ఎన్కౌంటర్లో పాల్గొంది మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా.
అయితే… ఈ ఎన్కౌంటర్లో హిడ్మా, పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న తప్పించుకున్నారు. కానీ ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. కాగా, అటు తెలంగాణ మావోయిస్ట్ పార్టీ సెక్రటరీ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ పాటు 17 మంది మృతి చెందినట్లు ఆ పార్టీ ప్రకటించింది. చొక్కారావు 30 ఏళ్లుగా మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. ఇతనిపై రూ.50 లక్షల రివార్డు ఉంది. స్వస్థలం ములుగు జిల్లా కాల్వపల్లి.
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతి చెందిన దామోదర్ మృతదేహాన్ని పోలీసులకు దొరకకుండా తీసుకెళ్లిన హిడ్మా దళం
ఛత్తీస్గఢ్ కాంకేర్ ఎన్కౌంటర్లో పాల్గొన్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా
ఎన్కౌంటర్లో తప్పించుకున్న హిడ్మా, పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న
ధ్రువీకరించని పోలీసులు https://t.co/FSspvOG2vn pic.twitter.com/w5CgeuKT5e
— BIG TV Breaking News (@bigtvtelugu) January 18, 2025