కరోనా వైరస్ కారణంగా వ్యాపారాలు అన్నీ దెబ్బతిన్నాయి. ఉద్యోగాలు పోయాయి..ప్రజల్లో డబ్బు ఆదా చేయటం అలవాటైంది. దీని ఫలితంగా ట్రావెల్ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కరోనాకు ముందే ఆటోమొబైల్ ఇండస్ట్రీ తిరోగమనంలో ఉంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచే కార్ల అమ్మకాలు తగ్గాయి. దీనికి COVID-19 తోడవ్వడంతో వ్యాపారాలు మరింత క్షీణించాయ అనే టాక్ నడుస్తోంది. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో జపాన్ కార్ల తయారీ సంస్థ డాట్సన్ భారత్‌లో అమ్మకాలను పెంచుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కార్పొరేట్ డిస్కౌంట్, ఎక్సేంజ్ డిస్కౌంట్, ఈయర్ ఎండ్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్, అదనపు కార్పొరేట్ డిస్కౌంట్ అంటూ వినియోగదారులను ఆకట్టుకునేలా రాయితీలను ప్రవేశపెట్టింది. అంతేకాదండోయ్… కొవిడ్ వారియర్స్ అయిన వైద్యులకు ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. ఇంకేందుకు ఆలస్యం ఏ ఏ మోడల్స్ పైన ఏ ఏ రాయితీలు ఉన్నాయో తెలుసుకోండి.
ఈ మోడల్‌పై వైద్య నిపుణులకు ఎలాంటి అదనపు కార్పొరేట్ డిస్కౌంట్ లభించదు. కొనుగోలుదారులు రూ.20,000 వరకు క్యాష్ డిస్కౌంట్, అంతే మొత్తంలో ఎక్సేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. 11వేల ఈయర్ ఎండ్ డిస్కౌంట్ కూడా పొందవచ్చట!
Datsun Redi-GO
ఈ కారు కొనుగోలుపై వినియోగదారులు రూ.7,000 క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, రూ.11,000 వరకు ఈయర్ ఎండ్ బెనిఫిట్ పొందవచ్చు. వైద్య వృత్తిలో ఉన్న వారికి రెడీ గో మోడల్‌పై డాట్సన్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. వైద్య నిపుణులు ఈ మోడల్ కారు కొనుగోలుపై రూ.5,000 అదనపు కార్పొరేట్ డిస్కౌంట్ పొందవచ్చు.
Datsun GO+
డాట్సన్ GO ప్లస్ మోడల్ కారు కొనుగోలుపై రూ.11,000 వరకు ఈయర్ ఎండ్ డిస్కౌంట్ లభిస్తుంది. కొనుగోలుపై రూ.15 వేలు క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఉంటుందని డాట్సన్ కంపెనీ ప్రకటించింది.
ఇవి ఆ కంపెనీ ప్రకటించిన డిస్కౌంట్లు..మరి మీ బడ్జెట్ కు ఏది వస్తుందో అది సెలక్ట్ చేసుకోండి.