ఢిల్లీః రేపటి నుంచి రెండవ విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. 30 రోజుల తర్వాత తిరిగి ప్రారంభం కానున్నాయి పార్లమెంట్ సమావేశాలు.ఈ నేపథ్యంలోనే.. నేడు ఉదయం 10 గంటలకు సోనియా గాంధీ నివాసంలో “పార్లమెంట్ వ్యూహ వ్వవహారల కమిటీ” సమావేశం జరుగనుంది.
ఈ సమావేశంలో ఏఐసిసి సంస్థాగత వ్యవాహారాల ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌధురి, మల్లిఖార్జున్ ఖర్గే, జైరామ్ రమేష్, చిదంబరం, గౌరవ్ గొగోయ్ పాల్గొననున్నారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహం, “ఫ్లోర్ కోఆర్డినేషన్”, ఉభయ సభల్లో భావసారూప్యతగల పార్టీలతో సమన్వయం పై ఈ సందర్భంగా చర్చ జరుగనుంది.
ఇక అటు ప్రతి పక్షాలను ఎలా ఎదుర్కోవాలో.. బీజేపీ ప్రభుత్వం సన్నద్దం అవుతోంది. అలాగే.. నాలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. రెండవ విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో చాలా దూకుడుగా వ్యవహరించే ఛాన్స్ ఉంది.