నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం…తెరపైకి జమిలి ఎన్నికల బిల్లు?

-

కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ముహుర్తం ఫిక్స్‌ అయింది. దీంతో తెరపైకి జమిలి ఎన్నికల బిల్లు వచ్చింది. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది.

The Union Cabinet meeting will be held today at 1 pm under the chairmanship of Prime Minister Narendra Modi

ఈ సందర్భంగా “ఒకే దేశం-ఒకే ఎన్నిక” బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత లోకసభ లో “ఒకే దేశం-ఒకే ఎన్నిక” బిల్లును ఏ క్షణంలోనైనా ప్రభుత్వం ప్రేవేశపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.

కాగా, జమిలి ఎన్నికలు… ఇవి గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న పదం.. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని బిజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.. ఇందుకోసం ఆ పార్టీ రోడ్ మ్యాప్ కూడా సిద్దం చేసింది.. 2027లో జమిలి ఎన్నికలు నిర్వమించాలని భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news