జీ20 సమావేశానికి కౌంట్ డౌన్ మొదలైంది. రేపు, ఎల్లుండి ఢిల్లీలో జి20 సమావేశాలు జరుగనున్నాయి. ఈ తరుణంలోనే.. ఇవాళ భారత్ కు చేరుకోనున్నారు అగ్రదేశాల అధినేతలు. ఈ జీ 20 సమావేశాలకు 20 సభ్య దేశాలు, 11 ఆహ్వాన దేశాలు హాజరవుతున్నాయి. ఈ తరుణంలోనే.. ఢిల్లీలో మొదలయ్యాయి ట్రాఫిక్ ఆంక్షలు.
ఇక ఇటు ఈరోజు ఇండియాకు రానున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోదీ భేటీ అవనున్నారు. జో బైడెన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్న మోదీ.. ఈ భేటీలో శుద్ధ ఇంధనం, వాణిజ్యంపై చర్చించనున్నారు. హైటెక్నాలజీ, రక్షణ రంగాల్లో ఇరు దేశాల బంధంపై సమీక్ష జరపనున్నారు. అలాగే రష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంపై చర్చించే అవకాశం కూడా ఉన్నట్లు తెలిసింది. మరోవైపు ఇటీవల మోదీ అమెరికా పర్యటనలో కుదిరిన ఒప్పందాల పురోగతిపై సమీక్ష చేసే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.