BREAKING : మహారాష్ట్రలో విషాదం..పడవ బోల్తా, ఆరుగురు మహిళలు గల్లంతు

-

 

BREAKING : మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా కొట్టి, ఆరుగురు మహిళలు గల్లంతు అయ్యారు. ఈ సంఘటన మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో చోటు చేసుకుంది. వైన్ గంగా నదిలో పడవ బోల్తా కొట్టింది. దీంతో ఆరుగురు మహిళలు గల్లంతు కాగా ఇద్దరు మహిళల మృతదేహలు లభ్యం అయ్యాయి.
చాముర్సి తాలుక గణపూర్ చెందిన 13 మంది వ్యవసాయ కూలీలు నిత్యం మిరప పంటలోఏరివేత వెళ్తుంటారు.

Tragic Boat Capsize in Gadchiroli

గణపూర్ నుంచి చంద్రపూర్ జిల్లా గంగా పూర్ వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. 7 మంది వెళ్తుండగా ప్రమాదం జరిగిందట. అయితే… ఈదుకుంటూ ఒక్క మహిళను ఒడ్డుకు చేర్చాడు పడవ నడుపుతున్న వ్యక్తి. ఇక మరో 6 గురు గల్లంతు అయ్యారు. ఇందులో జీజాబాయి రౌతు(55), పుష్ప జాడే(42) మృత దేహాలను బయటకు తీసింది రెస్క్యూ టీం. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version