పట్టాలు తప్పిన రైలు.. చెల్లాచెదురుగా పడిన 20 బోగీలు

-

మహారాష్ట్ర అమరావతిలో దీపావళి పూట ప్రమాదం చోటుచేసుకుంది. మల్ఖేడ్​ రైల్వే గ్రామం సమీపంలో గూడ్స్​ రైలు పట్టాలు తప్పింది. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో బల్​హర్షా నుంచి భుసావల్ వెళ్తున్న సరకు రవాణా రైలు బోల్తా పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ప్రమాదంలో 20 బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటన సమయంలో భారీ శబ్దం రావడం వల్ల రైల్వే సిబ్బంది, స్థానికులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీపావళి పండుగ రోజున ఇలా మూడు, నాలుగు గంటలపాటు రైళ్లు ఆలస్యంగా ప్రయాణించడం వల్ల చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version