రైల్వే ప్రయాణికులకు అలర్ట్… ఈ సేవలు బంద్..!

-

మీరు రైలు ప్రయాణం చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీరు దీనిని తెలుసుకోవాలి. లేదు అంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ట్రైన్ టికెట్ రిజర్వేషన్ సర్వీసులు కొన్ని గంటల పాటు నిలిచిపోనున్నాయి. ఈ విషయాన్నీ స్వయంగా ఇండియన్ రైల్వేస్ ఏ చెప్పింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

ట్రైన్ టికెట్ రిజర్వేషన్ సర్వీసులు కొన్ని గంటల పాటు నిలిచి పోతున్నాయని.. టికెట్ బుక్ చేసుకునే వారు ఈ విషయాన్ని గమనించాలని ఇండియన్ రైల్వేస్ అంది. ఇది ఇలా ఉంటే ఇండియన్ రైల్వేస్ కి చెందిన ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ PRS వచ్చే వారం రోజుల పాటు పని చేయవని రైల్వే మంత్రిత్వ శాఖ అంది.

దీనికి గల కారణం సిస్టమ్ డేటా అప్‌గ్రడేషన్, కొత్త ట్రైన్ నెంబర్ల అప్‌డేట్ వంటి అంశాల వల్లనే. అందుకని ఈ సేవలు పని చేయవు అని తెలుస్తోంది. ప్యాసింజర్ సర్వీసులను మళ్ళీ మునుపటిలా తీసుకురావడానికి ఇండియన్ రైల్వేస్ ప్రయత్నం చేస్తోంది.

అందువల్ల పీఆర్ఎస్ ఆరు గంటల పాటు పని చేయదని రైల్వే శాఖ అంది. వచ్చే వారం రోజులు కూడా ఇలానే ఉంటుంది. నవంబర్ 21-22 వరకు 23.30 గంట నుంచి 05.30 వరకు సేవలు అందుబాటులో వుండవు గమనించండి.

Read more RELATED
Recommended to you

Latest news