చంద్రబాబు కూటమి సర్కార్ పై వైఎస్ జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అమ్మఒడి పాయే..వసతి దీవెన పాయే అంటూ జగన్ మాస్ ర్యాగింగ్ చేశారు. తెచ్చినవి.. చేయబోతున్న అప్పులు లక్ష కోట్లకు పైమాటే.. ఇన్ని అప్పులు చేసినా సూపర్ సిక్స్ ఏమైనా ఇచ్చారా..అంటూ నిలదీశారు. మేము గతంలో అమలు చేసిన పథకాలు ఏమైనా కొనసాగుతున్నాయా.. అంటూ ప్రశ్నించారు వైఎస్ జగన్.
పిల్లలకు చదువులను ప్రోత్సహిస్తూ తల్లులకు ఇచ్చిన అమ్మఒడి పోయే.. వసతి దీవెన పోయే.. మిగతా ఇస్తున్న పథకాలు అరకొరే అంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికలకు ముందు ప్రతీ ఇంటింటికీ తన మనుషులను పంపి మోసపూరిత మాటలు ప్రచారం చేసిన బాబు.. ప్రతీ వర్గాన్ని ఆకట్టుకునేలా రొటీన్ గా కొన్ని మాటలు చెప్పాడని ఆగ్రహించారు. హామీలకు గ్యారంటీగా బాండ్లు కూడా పంచారు..అమలు చేయలేకపోతే చొక్కా పట్టుకుని నిలదీయాలన్నారన్నారు. ఇప్పుడు ఆ బాండ్లు ఏమయ్యాయి.. ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు వైఎస్ జగన్.