క్రికెట్ ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త. క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ షెడ్యూల్ చేసిన తేదీ కంటే ఓ రోజు ముందే జరిగే అవకాశం ఉంది. అక్టోబర్ 15న దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి.
ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని, అందువల్ల మ్యాచ్ అక్టోబర్ 14న నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. రీషెడ్యూల్ త్వరలోనే రిలీజ్ కానుంది. కాగా, అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19 వ తేదీ వరకు వన్డే వరల్డ్ కప్ జరుగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది.