భారీ సంఖ్యలో భారతీయుల ఖాతాలపై నిషేధం విధించిన ఎక్స్‌

-

ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ భారతీయులకు షాక్ ఇచ్చింది. తాజాగా పెద్ద సంఖ్యలో భారతీయుల ఖాతాలపై నిషేధం విధించింది. ఆగస్టు 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 25వ తేదీ మధ్య 5 లక్షల 59 వేల 439 ఖాతాలను నిషేధించింది. నిషేధానికి గురైన ఖాతాలన్నీ భారతీయ ఐటీ చట్టాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపడుతున్నట్లు గుర్తించామని ఎక్స్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది.

భారత్‌లోని యూజర్ల నుంచి 3 వేల 76 ఫిర్యాదులను స్వీకరించినట్లు ఎక్స్‌ తెలిపింది. ఖాతా సస్పెన్షన్‌లపై అప్పీల్‌ చేసిన 116 ఫిర్యాదుల్ని ప్రాసెస్‌ చేశామని.. వాటి పరిశీలన అనంతరం 10 ఖాతాలు మినహా మిగిలిన ఖాతాల్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొంది. వేధింపులు, ద్వేషపూరిత ప్రవర్తన, పిల్లలపై లైంగిక దాడి, అడల్ట్‌ కంటెంట్ వంటి అంశాలకు సంబంధించినవి ఫిర్యాదుల్లో ఉన్నాయని వెల్లడించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఉన్న వెయ్యి 675 ఖాతాలను నిషేధించినట్లు పేర్కొంది. సెప్టెంబర్‌లో నిషేధించిన 5 లక్షల 57 వేల 764 ఖాతాల్లో….. చిన్నారులపై లైంగిక వేధింపులను, నగ్న దృశ్యాలు ప్రోత్సహించే ఖాతాలు ఉన్నాయని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version